కొండాపూర్ డివిజన్ పరిధిలోని గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు మరియు సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే నాలల విస్తరణ నిర్మాణం పనులను మరియు RCC బాక్స్ నిర్మాణం పనులను SNDP విభాగం ఇంజనీరింగ్ అధికారుల తో కలిసి పరిశీలించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ సైబర్ హిల్స్ నుండి వయా జనార్దన్ హిల్స్ యూరో కిడ్స్ స్కూల్ వరకు 13.86 కోట్ల రూపాయల తో నాల విస్తరణ పనులు మరియు గఫుర్ నగర్ కాలనీ జంక్షన్ నుండి దుర్గం చెరువు వరకు 11.55 కోట్ల రూపాయలతో RCC బాక్స్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అని ,మొత్తము 25 కోట్ల 41 లక్షల రూపాయల అంచనావ్యయం తో నాల విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుంది అని , పనులలో వేగం పెంచాలని ,యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించాలని,అధికారులకు తెలియచేసారు . పనుల పై పలు సలహాలు ,సూచనలు ఇవ్వడం జరిగినది.
ప్రతి వర్షానికి వరద నీరు కాలనీలు ముంచెత్తడం జరుగుతుంది అని, సమస్య శాశ్వత పరిష్కారం దిశగా పనులు చేపట్టడం జరుగుతుంది అని, భవిష్యత్తు లో వరద సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకొని నాల విస్తరణ పనులు చేపడుతున్నాం అని, నాల విస్తరణ మరియు ,RCC బాక్స్ డ్రైన్ నిర్మాణము వలన ప్రజలకు ఎంతగానో ఉపశమనం కలుగుతుంది అని, ప్రజలకు సాంత్వన చేకూరుతుంది అని, రాబోయే వర్షాకాలం లోపు పనులు పూర్తిచేయాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పనుల విషయంలో ఎక్కడ రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడలని,రాబోయే వర్షకాలంను దృష్టిలో పెట్టుకొని ప్రజా అవసరాల దృష్ట్యా అసంపూర్తిగా మిగిలిపోయిన నాలా విస్తరణ నిర్మాణ పనులను చేపట్టడం జరిగినది అని, యుద్ధప్రాతిపదికన పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని,నాల నిర్మాణ పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని,నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకుడదని, పనుల లో వేగం పెంచాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని త్వరితగతిన నాల విస్తరణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
నాల విస్తరణ పై ఏవైనా ఇబ్బందులు ఎదురైతే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ఏ చిన్న సమస్య ఎదురైన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని PAC చైర్మన్ గాంధీ అధికారులకు తెలియచేసారు.
ఈ కార్యక్రమంలో SNDP అధికారులు ఈఈ సత్యనారాయణ , డీఈ వశిధర్, ఏ. ఈ వెంకటేష్ మరియు నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.