SAKSHITHA NEWS

పీజేఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

దివంగత మాజీ మంత్రి, కార్మిక నాయకుడు స్వర్గీయ పి.జనార్దన్ రెడ్డి వర్ధంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని పీజేఆర్ నగర్లో ఉన్న పీజేఆర్ విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ నుండి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఆయన చేసిన సేవలు, అభివృద్ధి పనులు మరువలేనివని గుర్తు చేశారు. పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన ఘనత పీజేఆర్ దే అని అన్నారు. పీజేఆర్ ఆశయాలు యువతకు ఆదర్శం అని అన్నారు. కార్యక్రమంలో సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, జి.రవి, CH.భాస్కర్, షౌకత్ అలీ మున్నా, అగ్రవాసు, సంగమేష్, రవీందర్, ప్రభాకర్, అజామ్, అరుణ, సౌందర్య, పుట్టం దేవి, సరిత, బుజమ్మ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS