SAKSHITHA NEWS

కొత్తగూడ మండల ప్రజలకు హెచ్చరిక:

కోనాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి సంచారం

నల్లబెల్లి మండలం అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగు జాడల్ని గుర్తించిన ప్రజలు, నిర్ధారించిన అటవీ అధికారులు. అవే గుర్తుల్ని ఈరోజు కొత్తగూడ మండలం కోనాపురం అటవీ ప్రాంతంలో గుర్తించడం జరిగింది. కావున కొత్తగూడ మండల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండగలరు. పశువుల కాపర్లు కొద్దిరోజులు పశువులు మేపడానికి అడవికి వెళ్లకపోవడం మంచిది. ప్రజలంతా తమ వ్యవసాయ పనులను త్వరగా ముగించుకొని చీకటి పడక ముందే ఇంటికి చేరుకోగలరు. రాత్రి వేళలో బయట తిరగడం శ్రేయస్కరం కాదు. తప్పని పరిస్థితుల్లో ఒంటరిగా వెళ్లకుండా ఉండడం మంచిది. ఒకవేళ మీ గ్రామాల్లో పెద్దపులి సంచారానికి సంబంధించి ఎటువంటి ఆనవాళ్లు గుర్తించిన వెంటనే పోలీసువారికి మరియు అటవీ అధికారులకు సమాచారం అందించగలరు. దయచేసి పుకార్లను వ్యాప్తి చేయవద్దు, ఎటువంటి సమాచారం ఉన్న అధికారులకు తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి.

      కుశ కుమార్ 
      ఎస్సై కొత్తగూడ.

SAKSHITHA NEWS