SAKSHITHA NEWS

ప్రేమ, ఆనందం, కరుణలతో కూడిన పండుగే క్రిస్మస్ : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : 129 – సూరారం డివిజన్ స్కందానగర్ లోని “మరనాత బైబిల్ మిషన్ దేవాలయం” నందు రెవ.తిమోతి రాజు ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ సెలబ్రేషన్స్ కార్యక్రమానికి కుత్బుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ప్రేమ, ఆనందం, కరుణలతో కూడిన పండుగే క్రిస్మస్ అని అన్నారు. ఆ యేసు ప్రభు దయతో ప్రజలంతా సంతోషంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో- ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు, నాయకులు దొడ్ల ఆంజనేయులు, దొడ్డ శ్రీను, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS