SAKSHITHA NEWS

సంక్షేమ సంఘాల సమిష్టి కృషితోనే కాలనీల సమగ్రాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

సాక్షిత : పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 128 – చింతల్ డివిజన్ రంగా నగర్ కాలనీ సంక్షేమ సంఘం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మరియు సంక్షేమ సంఘం సభ్యులు ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని కాలనీలు, బస్తీలలో గత పదేళ్ల కాలంలో కోట్లాది రూపాయల నిధులతో మౌలిక వసతులను కల్పించామని, రానున్న రోజుల్లో కూడా కాలనీలలో మౌలిక వసతుల కల్పనకు కృషిచేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు బండారు వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి జన్ను లక్ష్మణరావు, వైస్ ప్రెసిడెంట్ మండవ రాంప్రసాద్, ట్రెజరర్ సరోజ, జాయింట్ సెక్రెటరీ ఎం వి సత్యనారాయణ, కమిటీ మెంబర్స్ గుమ్మడి రామకృష్ణ, మహేష్, ఆనంద్, సురేందర్, నరసయ్య, ఎల్లప్ప, కేశవ, కరుణాకర్, పద్మజా రెడ్డి, శాంత కుమారి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS