ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 32 వినతులు.
అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి.
తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 32 వినతులు వచ్చాయని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ చరణ్ తేజ్ రెడ్డి తెలిపారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సుమారు 32 మంది వివిధ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ వినతులు అందించారు. అందులో ముఖ్యంగా కొర్లగుంట నందు డ్రెయినేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, ప్రజలకు వైద్య పరీక్షలు చేయించాలని కోరారు, ప్రభుత్వ ఇంటి కొరకు దరఖాస్తు చేసుకున్నామని, ఆ నగదు ఇప్పించాలని, రోడ్డు విస్తరణకు తమ స్థలం తీసుకున్నారని టి.డి.ఆర్.
బాండ్లు ఇప్పించాలని, ఓ వ్యక్తి డి.కె.టి. స్థలంలోని కాలువపై అక్రమంగా ఇల్లు నిర్మిస్తున్నారని ఆపు చేయాలని, సుబ్బారెడ్డి నగర్ నందు డ్రెయినేజీ కాలువ కొరకు తవ్విన గుంత పూడ్చాలని, గొల్లవాని గుంట, రాజీవ్ నగర్ నందు డ్రెయినేజీ కాలువలు ఏర్పాటు చేయాలని, శ్రీనివాస సేతు పిల్లర్ 24 వద్ద గుంత పూడ్చాలని, పాత రేణిగుంట రోడ్డు రిలయన్స్ మార్ట్ వద్ద చెత్త వేస్తున్నారని నివారించి శుభ్రంగా ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్ సేతు మాధవ్, రవి, వెటర్నరీ డాక్టర్ నాగేంద్ర, ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డి, డి.ఈ.లు, ఏ.సి.పి.లు, శానిటరీ సూపర్ వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.