సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు ఒక వరం లాంటిది : ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
లబ్ధిదారుడికి రూ.1, 46,075 చెక్కు అందజేత
విజయవాడ : రాష్ట్రంలోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరం లాంటిది. అనారోగ్యం బారిన పడి వైద్య చికిత్సలు చేయించుకున్న బాధితులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తక్షణం అందిస్తున్న సీఎంఆర్ఎఫ్(సీఎం రిలీ ఫ్ ఫండ్) చేయూతగా నిలుస్తుందని విజయవా ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు.
గురునానక్ కాలనీ లోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో సోమవారం సీఎంఆర్ఎఫ్ కింద మంజూరైన రూ.1, 46,075 చెక్కుతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంపిన లేఖను లబ్ధిదారుడు లగడపాటి జనార్ధన రావు కుమారుడు లగడపాటి హరిప్రసాద్ కి ఎంపి కేశినేని శివనాథ్ అందజేశారు చేశారు.
తిరువూరు నియోజకవర్గం గుళ్ళపూడి గ్రామం గుంపల గూడెం మండలానికి చెందిన లగడపాటి జనార్ధన రావు కి ఇటీవల హార్ట్ సర్జరీ జరిగింది. ఎంపి కేశినేని శివనాథ్ సాయంతో సీఎంఆర్ఎఫ్ కి పెట్టుకోవడం జరిగింది. తమకి సీఎంఆర్ఎఫ్ వచ్చే విధంగా సాయం చేసిన ఎంపి కేశినేని శివనాథ్ కి లగడపాటి హరిప్రసాద్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగు రైతు సంఘం అధ్యక్షుడు చెరుకూరి రాజేశ్వరరావు, బిసి నాయకులు బూరుగు నారాయణ రావు, రాజవరం గ్రామపార్టీ అధ్యక్షుడు సతీష్ లతో పాటు టిడిపి నాయకులు పాల్గొన్నారు.