జి.కొండూరు మండలంలో మాజీ ముఖ్య మంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టనరోజు వేడుకల్లో పాల్గొని కేక్ ను కట్ చేసిన మాజీ మంత్రి , జోగి రమేశ్ *
సాక్షిత ఎన్టీఆర్ జిల్లా: జి.కొండూరు గ్రామం, మైలవరం నియోజకవర్గం
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి యంగ్ డైనమిక్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జి.కొండూరు మండలంలోని జి.కొండూరు గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గం ఇంచార్జి మాజీ మంత్రి జోగి రమేష్ పాల్గొని అభిమానులు ఏర్పాటు చేసిన కేకును కట్ చేసినారు.
ఈ సందర్భంగా జోగి రమేష్ మాట్లాడుతూ….. జగనన్న మరలా ముఖ్యమంత్రిని చేసుకుంటేనే పేదవాని జీవితాల్లో ఆనందం, వెలుగులు ఉంటాయని ప్రతి ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుందని సంక్షేమ పథకాలు పార్టీలకతీతంగా కులాలకు ఆతీతంగా పేదలందరికీ అందుతాయని ఈ సందర్భంగా తెలియజేసినారు.
ఈ యొక్క కార్యక్రమంలో జి కొండూరు మండలం ఎంపీపీ వేములకొండ లక్ష్మితిరుపతమ్మ, జడ్పీటీసీ మందా జక్రదరరావు,గ్రామ సర్పంచి మండల అరుణ, కేడీసీసీ బ్యాంక్ మాజీ వైస్ చైర్మన్ వేములకొండ రాంబాబు , ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి వేములకొండ తిరుపతిరావు, మండల వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు ,గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేములకొండ విష్ణు, మండలంలోని ఆయా గ్రామాల సర్పంచులు, జడ రాంబాబు, పిల్లి రామారావు ,ఉమ్మడి ప్రసాదు, ప్రత్తిపాటి రవీంద్ర కుమార్, ఎంపీటీసీలు జంగం రామారావు చెన్నూరి సుబ్బారావు , నానవత్ శ్రీనివాసరావు,గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు అందరూ పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు.