SAKSHITHA NEWS

చందానగర్ డివిజన్ పరిధిలోని కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి నివాసంలో వారి ఆధ్వర్యంలో నిర్వహించిన సెమీక్రిస్టమస్ వేడుకలలో చందానగర్ డివిజన్ పరిధిలోని పాస్టర్లు మరియు సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి క్రిస్మస్ కేక్ ను కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కార్పొరేటర్ శ్రీమతి మంజుల రఘునాథ్ రెడ్డి ఆధ్వర్యంలో సెమీ క్రిస్టమస్ వేడుకలు నిర్వహించుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని, డివిజన్ పరిధిలోని పాస్టర్ల అందరి మధ్యలో కేక్ కట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. శాంతి, నీతి, ప్రేమ, దయ కరుణ లతో ప్రపంచానికి కొత్త మార్గం నిర్దేశించిన క్రీస్తు జన్మదినం సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులందరికి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియచేసారు. క్రిస్మస్ పండుగను భక్తి శ్రద్దలతో జరుపుకోవాలని ,చాలా పవిత్రమైన పండుగ అని .పండుగ ను చక్కటి వాతావరణం లో శాంతి యుతంగా కుటుంబ సభ్యుల మధ్య ఆనందాయకంగా ,సంతోషకరంగా జరుపుకోవాలని పిలుపునివ్వడం జరిగినది .అదేవిదంగా క్రిస్మస్ పండుగ ను ఘనంగా నిర్వహించుకోవడానికి చర్చిల వద్ద అన్ని రకాల వసతులు కలిపించాలని ,ఏర్పాట్లు చేయాలనీ అధికారులను ఆదేశించడం జరిగినది .ఎటువంటి ఇబ్బంది కలగకుండా చక్కటి వాతావరణం లో పండుగ నిర్వహించుకునేలా అన్ని రకాల ఏర్పాట్లను చేయాలనీ ఎమ్మెల్యే గాంధీ అధికారులను ఆదేశించడం జరిగినది . అన్ని మతాల వారి పండగలకు ప్రధాన్యతనిస్తూ సోదరభావంతో ఐక్యమత్యానికి ప్రతీకగా ముందుకు వెళ్తున్నారని ,క్రిస్టియన్ వారికీ క్రిస్టమస్ కానుకలు అందించడం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .క్రిస్మస్ సోదర సోదరిమనులకు కిస్టమస్ శుభకాంక్షలు తెలియచేస్తునని ,అర్హులైన ప్రతి పేద వారికీ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో నాయకులు రఘునాథ్ రెడ్డి, నరేందర్ బల్లా, సందీప్ రెడ్డి మరియు పాస్టర్లు ఆంటోనీ , ఏలీయా, డేనియల్, కరుణాకర్, మోసెస్, సునీల్, నటానిల్ మరియు క్రైస్తవ సోదర, సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS