SAKSHITHA NEWS

జిల్లా టిడిపి కార్యాలయంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు..

క్రిస్మస్ సందర్భంగా పల్నాడు జిల్లా టిడిపి కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించగా ప్రభుత్వ చీఫ్ విప్, సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేసి ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రెవరెండ్ ఫాదర్ రవి, ఫెడ్రక్ లు పవిత్రమైన బైబిల్ వాక్యాలను చదివి వినిపించి ప్రార్థనలు చేశారు.

సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అన్ని మతాలను సమానంగా చూస్తూ సర్వ మానవ సౌబ్రాతృత్వం కోసం కృషి చేసే లౌకికవాద పార్టీ అని తెలిపారు. ప్రేమ అంటేనే జీసెస్ అని, పొరుగు వారిని ప్రేమించడమే క్రైస్తవ మత సిద్ధాంతమని అన్నారు. కార్యక్రమంలో పల్నాడు జిల్లా అధ్యక్షులు కొమ్మలపాటి శ్రీధర్ గారు, ఎమ్మెల్యే చదలవాడ అరవిందు బాబు , ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు , ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ , చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి , టిడిపి నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS