SAKSHITHA NEWS

వరంగల్: హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందిన కానిస్టేబుళ్ళు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న 96 బ్యాచ్ కు చెందిన 19మంది కానిస్టేబుళ్ళు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి పొందారు. వరంగల్ సీపీని కలుసుకొని పుష్పగుచ్చాలను అందజేశారు. అధికారులు అప్పగించిన పనులను నిజాయితీగా చేస్తూ, సమాజంలో గుర్తింపు తెచ్చుకోవాలని పోలీస్ కమిషనర్ తెలిపారు. సీపీని కలిసిన వారిలో హెడ్ కానిస్టేబుళ్ళు అశోక్, బాబు, స్వామి, దామోదర్ ఉన్నారు.


SAKSHITHA NEWS