కాళేశ్వరం విచారణకు నేడు స్మిత సబర్వాల్!
హైదరాబాద్:
కాళేశ్వరం కమిషన్ బహి రంగ విచారణ రెండోరోజు కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఇవాళ మాజీ సీఎస్ సోమేష్ కుమార్, ఐఏఎస్ అధికారి యువజన సర్వీసుల శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్ కమిషన్ ముందు విచారణ కు హాజరయ్యారు.
ఓపెన్ కోర్టులో స్మితా సబర్వాల్‌ను కమిషన్ విచారిస్తోంది. అనంతరం కమిషన్ ముందు రిటైర్డ్ ఐఏఎస్ సోమేష్ కుమార్ హాజరుకానున్నారు.కాగా మేడిగడ్డ, అన్నారం, సుంది ళ్ల బ్యారేజీలు కట్టాలని నిర్ణయం తీసుకున్నది
మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులేనని ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శైలేంద్రకుమార్ జోషి నిన్న బుధవారం తెలిపారు. రాష్ట్ర ఏర్పాటు అనంత రం.. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల రీ ఇంజనీ రింగ్‌కు గత ప్రభుత్వం నిర్ణయించిం దని.. దాంట్లో భాగంగానే మేడిగడ్డపైనా నిర్ణయం తీసుకుందని కమిషన్‌కు వివరించారు.
విచారణ సందర్బంగా జోషికి కమిషన్ ప్రశ్నలు వేసింది.మేడిగడ్డ, అన్నా రం, సుందిళ్ల బ్యారేజీలు కట్టడానికి కారణం ఏంటని కమిషన్ ప్రశ్నించగా… తెలంగాణ ఏర్పాటు అనంతరం ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టును రీ ఇంజనీరింగ్ చేశారని, అన్నారు.
అప్పటికి బ్యారేజీ తప్ప ఇతర కాంపోనెంట్ల పరంగా 7.7 శాతం పనులు జరిగాయని శైలేంద్రకుమార్ జోషి అన్నారు. మహారాష్ట్ర అభ్యంతరాలు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రంతో మేడిగడ్డ నిర్మాణంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, కేంద్ర జలవనరుల సంఘం కూడా తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత లేదని, ఆఫ్ లైన్, అన్‌లైన్ రిజర్వాయర్ల నీటి సామర్థ్యం పెరగాలని చెప్పిందని ఆయన సమాధానం ఇచ్చారు.
బ్యారేజీలు అక్కడే కట్టాలనే నిర్ణయాలు ఎవరివి అనే ప్రశ్నకు అప్పటి సీఎం కేసీఆర్ నేతృత్వంలో వ్యాప్కోస్ కమిటీ, సీఈ, సీడీవో, ఇంజనీర్లతో జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారనిశైలేంద్రకుమార్ జోషి వెల్లడించారు,
సబ్‌కమిటీ వేయలేదని, 2016 మే 2న మేడిగడ్డ బ్యారేజీ వద్ద కేసీఆర్ భూమి పూజ చేసి, మూడు బ్యారేజీల నిర్మాణం ప్రారంభించారని, అదే రోజు ప్రాణహిత చేవెళ్ల పేరు మార్చారని తెలిపారు