SAKSHITHA NEWS

అనారోగ్యంతో బలగం మొగిలయ్య మృతి

వరంగల్ జిల్లా:
బలగం సినిమాలో క్లైమాక్స్ లో ఆయన పాడిన పాట కోట్లాది మందిని ఏడిపిం చిన బలగం మొగిలయ్య ఇకలేరు.

కొన్ని రోజులుగా కిడ్నీలు ఫేయిల్యూరై.. తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వరంగల్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స తీసు కుంటున్నారు.ఈ క్రమంలో ఆరోగ్య పరిస్థితి విషమించ డంతో తెల్లవా రు,జామున మరణించారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు.

మొగిలయ్య వైద్య ఖర్చుల నిమిత్తం బలగం డైరక్టర్‌ వేణు యెల్ధండి, చిత్ర యూ నిట్ తో పాటు ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం అందించింది.తెలంగాణ గ్రామీణ నేపథ్యంలో విడుద లైన బలగం సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే.

ఈ సినిమాలోని క్లైమాక్స్ పాటను లో భావోద్వేగ భరి తమైన పాటను ఆలపించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ పాట తో రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

కొన్నాళ్లుగా మొగిలయ్య కిడ్నీ సంబంధిత వ్యాధితో పాటు హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. ఇప్ప టికే ఆయనకు తెలంగాణ ప్రభుత్వం చికిత్స అందించింది. హైదరాబాద్ తరలించి మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించారు.

ఆతర్వాత బలగం డైరెక్టర్ వేణుతోపాటు, మెగాస్టార్ చిరంజీవి సైతం ఆయనకు ఆర్థిక సాయం చేశారు.


SAKSHITHA NEWS