SAKSHITHA NEWS

బాల వైజ్ఞానిక ప్రదర్శన ను విజయవంతం చేయాలి.
జిల్లా విద్యాధికారి కె. అశోక్.
సాక్షిత ప్రతినిధి కోదాడ)
సూర్యాపేట జిల్లా స్థాయి బాల వైజ్ఞానిక ప్రదర్శన 2024 విజయవంతం చేయాలని జిల్లా విద్యాధికారి కె. అశోక్ కోరారు.17/12/24 స్థానిక సి సి ఆర్ స్కూల్ కోదాడ నందు ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశం లో మాట్లాడినారు. ఈనెల డిసెంబర్ 19 ,20 తేదీలలో సిసిఆర్ స్కూల్ కోదాడ నందు నిర్వహించనున్నట్లు తెలిపారు. నిర్వహణ కోసం 23 కమిటీలను ఎం ఈ ఓ లు, జి హెచ్ ఎమ్,ఉపాధ్యాయులు, వివిధ ఉపాధ్య య సంఘాల ప్రతినిధులతో ఎర్పాటు చేసినట్లు,వాటి విధులు , భాద్యతలు , క్రమశిక్షణ అంకిత భావంతో నిర్వహించాలని డి ఎస్ ఓ జిల్లా సైన్సు అధికారి ఎల్.దేవరాజు గారు వివరించి ,కోరారు. ఇట్టి కార్యక్రమంలో కోదాడ మండల విద్యాధికారి ఎండి సలీం షరీఫ్, సూర్యాపేట మండల విద్యధికారి ఎస్. శ్రీనివాస రావు వివిధ కమిటీల కన్వీనర్లు,కో కన్వీనర్లు స భ్యులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS