బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
బెల్లంపల్లి: కానిస్టేబుళ్ల శిక్షణ త్వరితగతిన పూర్తి చేయాలి
కొత్తగా వచ్చిన కానిస్టేబుళ్లకు త్వరితగతిన శిక్షణ పూర్తి చేయాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సంబంధించిన అధికారులకు సూచించారు. బెల్లంపల్లి పోలీస్ హెడ్ క్వార్టర్ ను ఆయన మంచిర్యాల డీసీపీ భాస్కర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఆర్ముడు సిబ్బంది గౌరవ వందన స్వీకరించారు. అనంతరం ఆర్ఐ కార్యాలయాలను పరిశీలించారు. విధుల గురించి ఆర్ ఐలను అడిగి తెలుసుకున్నారు.