నారాయణ స్కూల్ లో మరో విద్యార్థి ఆత్మహత్య?
హైదరాబాద్:
తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నిన్న హైదరాబాద్‌లో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువకముందే ఇవాళ మరో విద్యార్థి ఆత్మహత్య సంచలనంగా మారింది.
హయత్ నగర్ పరిధిలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వెలుగు లోకి వచ్చింది. లోహిత్ అనే విద్యార్థి హయత్ నగర్ లోని నారాయణ రెసిడెన్షి యల్ స్కూల్లో ఏడో తరగతి చదువుకుంటు న్నారు.
అక్కడే హాస్టల్లో వుండి చదువు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అయితే సోమవారం రాత్రి హాస్టల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫ్రెండ్స్ వెళ్లి లోహిత్ వున్న గది తలుపు లు కొట్టిన ఎంతకూ తీయక పోవడంతో పాఠశాల సిబ్బందికి తెలిపారు.
దీంతో లోహిత్ గది వద్దకు వచ్చిన సిబ్బంది గది తలుపులు తెరిచి చూడగా లోహిత్ ఫ్యాన్‌కు వేలాడు తూ కనిపించాడు.
ఇది గమనించిన పాఠశాల సిబ్బంది లోహిత్‌ను ఆస్ప త్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అనంతరం లోహిత్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. షాక్ తిన్న లోహిత్ కుటుంబ సభ్యులు పాఠశాలకు చేరుకుని కన్నీరుమున్నీ రుగా విలపించారు. పాఠ శాల సిబ్బందితో లోహిత్ కుటుంబ సభ్యులు, బంధువులు వాగ్వాదానికి దిగారు.
తమకు న్యాయం చేయా లని పాఠశాల ఎదుట బైఠాయించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీ సులు హాస్టల్ వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.