డబ్బు ఆశతోనే అన్నదమ్ములను చంపిన సోదరి
పల్నాడు జిల్లా నకరికల్లులో అన్నదమ్ములను సోదరి హతమార్చిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు సంబంధించి విస్తు పోయే నిజాలు బయటకు వస్తున్నాయి. స్థానికులు వివరాల మేరకు.. ఉపాధ్యాయుడైన తండ్రి పక్షవాతంతో మృతిచెందగా, ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక ప్రయోజనాలు కోసం కొంతకాలంగా ముగ్గురి మధ్య వివాదం నడుస్తోంది. దీంతో సోదరి కృష్ణవేణి సోదరుడు గోపికృష్ణను చున్నీతో ఉరివేయగా, దుర్గా రామకృష్ణను కాలువలో తోసి చంపినట్లు సమాచారం.