SAKSHITHA NEWS

సీఎం చంద్రబాబుతో పవన్‌ కల్యాణ్‌ భేటీ

సచివాలయం: ఏపీ సీఎం చంద్రబాబుతో (Chandrababu) డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరు నేతలు చర్చించారు..

పవన్‌ సోదరుడు నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇప్పటికే నిర్ణయించిన నేపథ్యంలో.. ఏ శాఖను కేటాయించాలన్న దానిపై చర్చించినట్లు తెలుస్తోంది. నాగబాబు ప్రమాణస్వీకార తేదీపైనా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

నామినేటెడ్ పదవుల తుదిజాబితా, ఇతర అంశాలపైనా చర్చించినట్లు సమాచారం. ప్రమాణస్వీకారం తర్వాత నాగబాబును ఎమ్మెల్సీగా ఎన్నుకొనే అవకాశముంది. ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో రాబోయే సహకార ఎన్నికల్లోనూ ఇదే తరహా సమన్వయం కొనసాగించాలని ఇరువురు నేతలు ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.


SAKSHITHA NEWS