SAKSHITHA NEWS

కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని కలసిన టి పి సి సి – లేబర్ సెల్ తెలంగాణ రాష్ట్రా ఆర్గనైజింగ్ సెక్రటరీ గోకర్ల లక్ష్మినారాయణ ఇటీవల నూతనంగా ఏర్పాటైన టి పి సి సి లేబర్ సెల్ రాష్ట్ర కమిటీ లో కూకట్ పల్లి నియోజకవర్గానికి కె పి హెచ్ బి కాలనీ ప్రాంతానికి చెందిన మానవ సేవె మాధవ సేవ ట్రస్ట్ వ్యవస్థాపకులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గోకర్ల లక్ష్మినారాయణ ని నూతనంగా టి పి సి సి – లేబర్ సెల్ తెలంగాణ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గా టి పి సి సి లేబర్ సెల్ ఛైర్మెన్ ఆర్.ప్రకాష్ గౌడ్ నియమించడం జరిగింది . ఈ సందర్బంగా కూకట్ పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ ని గోకర్ల లక్ష్మినారాయణ మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు.

బండి రమేష్ అభినందించి కాంగ్రెస్ పార్టీ నిపై నమ్మకం తో ఈ పదవి ఇచ్చినందుకు తెలంగాణ రాష్ట్రం లో భవన నిర్మాణ మరియు ఇతర నిర్మాణ రంగ కార్మికులు అలాగే సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన అర్హులైన కార్మికుల కు వారి సామాజిక న్యాయం మరియు సమస్యలు పరిష్కారాని కై కృషి చేయాలని అలాగే మానవ సేవె మాధవ సేవ ట్రస్ట్ తరపున సేవ కార్యక్రమాలు చేపట్టాలని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో సప్పిడి భాస్కర్ (టి పి సి సి లేబర్ సెల్ — కో -ఆర్డినేటర్ రాష్ట్ర సోషల్ మీడియా విభాగం మరియు ప్రెసిడెంట్ కూకట్ పల్లి నియోజకవర్గం ), A. శ్రీధర్, ఎండీ. నయీమ్, దుర్గా సింగ్, సయద్ బాషా తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS