తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా అన్ని మతాల ప్రత్యేక పండుగలకు బట్టలు పంపిణీ చేసిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుంది ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.
కూకట్ పల్లి నియోజక వర్గంలో క్రిస్మస్ సందర్భం బిఆర్ఎస్ క్రిస్టియన్ సెల్ అధ్యక్షులు డేవిడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకలకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,ఎమ్మెల్సీ నవీన్ కుమార్,ఫాస్టర్ ఐజాక్ లు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు.అనంతరం నియోజక వర్గంలోని ఫాస్టార్లకు ఎమ్మెల్యే సొంత నిధులతో బట్టల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నాటి నుండి తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని మతాల అన్ని కులాలకు వారి ప్రత్యేక పండగలకు బట్టలు పంపిణీ చేసిన ఘనత కేసీఆర్ కే దక్కుతుదన్నారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలో ఆడపడుచులకు బతుకమ్మ చీరలను, ముస్లింలకు రంజాన్ తోఫా, క్రిస్మస్ వేడుకలకు పాస్టర్లకు బట్టల పంపిణీ చేయడంలేదని ఇలాంటి దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఉండడం మన దురదృష్టకరమని ఎమ్మెల్యే అన్నారు. నియోజకవర్గంలోని క్రిస్టియన్ మతస్తులకు తామెప్పుడు అండగా నిలబడతామని ఎల్లవేళలా ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా తాము అండగా నిలబడతామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. అనంతరం పాస్టర్ ఐజాక్ మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం స్థానికంగా ఎమ్మెల్యే కృష్ణారావు క్రిస్టియన్ వేడుకలకు మరియు ప్రజలందరికీ అండగా నిలబడుతూ నియోజకవర్గంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరిష్కరించే నాయకుడికి ప్రజల అభిమానం ఎప్పటికీ ఉంటుందని పాస్టర్ ఐజాక్ అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు జూపల్లి సత్యనారాయణ ,ఆవుల రవీందర్ రెడ్డి, పండల సతీష్ గౌడ్, సబిహా గౌసుద్దీన్ ,శిరీష బాబురావు, మందడి శ్రీనివాసరావు ,శ్రీహరి మహేశ్వరి, రోజా రంగారావు, మాజీ కార్పొరేటర్,తూము శ్రావణ్ కుమార్, సతీష్ రావు మరియు రేవరన్. పరలోక నేస్తం పి. ఐజాక్, ఫాస్టర్లు డానియల్, డేవిడ్, సువార్తమ్మ, రాజు, స్వామి, విజయపాల్, జాన్ పాల్, లాల్ బాబు, దేవదానం, సాంసన్, సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.