సికింద్రాబాద్ : నిరుపేదలకు నాణ్యమైన వైద్య సేవలను పొందేందుకు తమ వంతు సహకారాన్ని అందిస్తున్నామని సికింద్రాబాద్ శాసనసభ్యులు, మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ అన్నారు. సితాఫలమండీ లోని ఎం.ఎల్.ఏ. క్యాంపు కార్యాలయంలో సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన 52 మంది లబ్దిదారులకు దాదాపు రూ.27 లక్షల విలువజేసే ముఖ్యమంత్రి సహాయ నిధి (సీ.ఎం.ఆర్.ఎఫ్) చెక్కులను శనివారం పద్మారావు గౌడ్ అందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు మంచి వైద్యం ఖరీదైన వ్యవహారంగా మారిన ప్రస్తుత రోజుల్లో వివిధ మార్గాల్లో వారిని ఆదుకుంటున్నామని, ముఖ్యమంత్రి సహాయ నిధిని సద్వినియోగం చేస్తున్నామని తెలిపారు. కార్పొరేటర్లు కంది శైలజ, రాసురి సునీత రమేష్, లింగాని ప్రసన్న లక్ష్మి శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి తో పాటు ప్రభుత్వ పదకలకై ప్రజలు అత్యవసర సందర్భాల్లో సితాఫలమండీ లోని తమ కార్యాలయాన్ని సంప్రదించాలని, ఎవరికీ లంచాలు చెల్లించాల్సిన అవసరం లేదని పద్మారావు గౌడ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. — MLA క్యాంపు కార్యాలయం.