SAKSHITHA NEWS

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ (TSWRI) బాలికల పాఠశాలలో జరిగిన కొత్త మెనూ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ రామకృష్ణ రావు , కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించి విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు అన్ని రకాల మంచి వసతులతో పాటు , నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని గొప్ప నిర్ణయం తీసుకున్నారు అని, విద్యార్థుల తరుపున నా తరుపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని PAC చైర్మన్ గాంధీ కొనియాడారు. ప్రతి సంక్షేమ వసతి గృహంలో కామన్ డైట్ మెనూ ను ప్రారంభించడం జరిగినది , యూనిఫాం ప్రిపరేషన్ విధానం, స్టోరేజీ మరియు కిచెన్ మరియు డైనింగ్ ఏరియా నిర్వహణ యొక్క స్టాండర్డైజేషన్ పై తీసుకున్న చర్యల పై వివరించాల్సిన బాధ్యత మన అందరి పై ఉంది అని PAC చైర్మన్ గాంధీ అన్నారు.

  1. ప్రభుత్వం 8 సంవత్సరాల తర్వాత డైట్ ఛార్జీలను ప్రస్తుత రేటు నుండి 40% పెంచడం జరిగినది.
  2. ప్రభుత్వం 16 సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ ఛార్జీలను 200% కంటే ఎక్కువ పెంచింది.
  3. అన్ని నివాస సంస్థలలోని బోర్డర్‌ల వ్యక్తిగత పరిశుభ్రత అవసరాలను అలాగే పేద సామాజిక-ఆర్థిక నేపథ్యాల నుండి వచ్చిన విద్యార్థుల పోషకాహార అవసరాలను తీర్చడానికి ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా ఉంటుంది అని,
  4. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కాంప్లెక్స్ ఏర్పాటు వంటి వినూత్న కార్యక్రమాలు విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్యా మరియు పాఠ్యేతర మౌలిక సదుపాయాలను అందించడంలో నిబద్ధతను చూపుతున్నాయి.
  5. రాష్ట్రవ్యాప్తంగా ఏకరీతి ఆహార ప్రణాళికను ఏర్పాటు చేయడం మరియు డైట్ తయారీ మరియు సర్వింగ్ మెథడాలజీని ప్రామాణీకరించడం తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి మూలలో ఉన్న వసతి గృహాలలో పోషకమైన ఇంకా రుచికరమైన ఆహారాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధమైన నిబద్ధత భారతదేశంలోనే మొదటిది మన రాష్ట్రం అని , ప్రపంచంలోని ఏ దేశంలోనూ లేనిది మన రాష్ట్రంలో అమలు చేయడం గొప్ప విషయం అని,
  6. స్టోరేజీ లేఅవుట్, కిచెన్ ఫ్లోర్ మేనేజ్‌మెంట్, ప్రొవిజన్ ప్రొక్యూర్‌మెంట్ సహాయంతో మరియు డిస్ట్రిబ్యూషన్‌తో పాటు డైనింగ్ ఏరియా మేనేజ్‌మెంట్ మరియు ఫుడ్ సర్వింగ్ ప్రాక్టీస్‌ల ప్రమాణీకరణ ఆహార సరఫరా నాణ్యతను నిర్ధారిస్తుంది, ఆహారంలో ఎలాంటి కలుషితం కాకుండా మరియు ఫుడ్ పాయిజనింగ్ అవకాశాలను తొలగిస్తుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

విద్యార్థులు క్రమశిక్షణ తో కూడిన విద్య ద్వారా ఉన్నత పౌరులుగా ఎదుగుతారు అని తల్లిదండ్రుల ఆశలు, ఆశయాలను నెరవేర్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది అని ,మంచిగా చదువుకొని తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని PAC చైర్మన్ గాంధీ ఆశించారు.

విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన ఆహారం అందించాలని ఎమ్మెల్యే గాంధీ సూచించారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు అందుతున్న మెను వివరాలు,ఉపాధ్యాయులను, విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.వంటశాల లోని,బియ్యాన్ని,సరుకులను నాణ్యతను పరిశీలించారు. వంటశాల మరియు
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రిన్సిపాల్ కు ,వంట సిబ్బందికి PAC చైర్మన్ గాంధీ తెలియజేశారు.

విద్యార్థులకు శుచి శుభ్రతతో కూడిన చక్కటి రుచికరమైన భోజనం అందించాలని విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలను తీసుకోవాలని , విద్యార్థులకు మంచి పౌష్టికాహారం తో కూడిన భోజనం తో పాటు మంచి విద్య ను అందించినప్పుడే వారికి ఉజ్వల భవిష్యత్తు ను ఇచ్చినవారం అవుతామని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు . మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని, ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని, తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలో ఉంటాయి అని ,మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిఆరోహించాచాలని విద్యార్థులకు PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు నాయకులు గ్రంథాలయ డైరెక్టర్ గణేష్ ముదిరాజ్, మంత్రిప్రగడ సత్యనారాయణ రావు, వినోద్, వేణు గోపాల్ రెడ్డి ,నగేష్ , ప్రభాకర్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS