రేపటి నుంచే గ్రూప్ 2 పరీక్షలు!
మహిళ అభ్యర్థులకు మంగళసూత్రం గాజులకు పర్మిషన్
నిమిషం ఆలస్యమైన ఇంటికే
హైదరాబాద్, తెలంగాణలో ఆదివారం, సోమవారం గ్రూప్ 2 పరీక్ష నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 783 పోస్టుల భర్తీకి గ్రూప్ 2 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవ్వగా.. 5,51, 847 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా 58 రిజీయన్ కేంద్రాల్లో 1368 పరీక్షా కేంద్రాలను ఎగ్జామ్ నిర్వహణ కోసం ఏర్పాటు చేశారు. డిసెంబర్ 15, 16 తేదీల్లో రెండు రోజుల పా టు, నాలుగు పేపర్ల ఎగ్జామ్ జరగనుంది. డిసెంబర్ 9 నుంచే ఆన్ లైన్ లో హాల్ టికెట్లు అభ్యర్థులకు అందు బాటులో ఉంచారు.
మొదటిరోజు పరీక్ష రేపు ఆదివారం పేపర్ -1 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు..పేపర్ -2 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది. రెండో రోజు పరీక్ష డిసెంబర్ 16 సోమవారంపేపర్ 3 ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 4 మధ్యా హ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరుగుతుంది.
ఒక్కో పేపర్ లో 150 ఆబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. సమాధానం రాసేందుకు అభ్యర్థులకు OMR షీట్‌ను అందజేస్తారు. గ్రూప్ -2 పరీక్ష నిర్వహణకు 49,843 మంది విద్యాసంస్థల సిబ్బందిని కేటాయించారు. వీరితో పాటు జిల్లా కలెక్టర్ కార్యాలయ సిబ్బంది 1,719 మంది పాల్గొననున్నారు.
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -2 పరీక్షకు భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ ను అమలు చేయనున్నారు. పరీక్ష నిర్వహణకు 6,865 మంది పోలీసులతో భద్రత కల్పించనున్నారు. సీసీ కెమెరాలతో నిఘాలో పరీక్షలు జరుగుతాయి.
అభ్యర్థులు గుర్తు పెట్టు కోవాల్సిన నిబంధనలు
ప్రతి పేపర్ పరీక్ష ప్రారం భానికి అరగంట ముందే ఎగ్జామ్ సెంటర్ గేట్లు మూసివేస్తారు. ఉద యం 9.30, మధ్యాహ్నం 2.30 కి గేట్లు మూసివేత
ఉదయం 8.30 నుంచి, మధ్యాహ్నం 1.30 నుంచి పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థు లను అనుమతి ఇస్తారు.
పరీక్ష హాల్ లోకి బ్లూ ఆర్ బ్లాక్ బాల్ పాయింట్ పెన్, పాస్ పోటో అంటించిన హాల్ టికెట్ తో పాటు ఏదైన ప్రభుత్వ ఫోటో ఐడెంటింటి కార్డు తీసుకొని రావాలి
ఎలక్ట్రానిక్ వస్తువులు, పేపర్లు, అదనపు స్టేషనరీ ని అనుమతించరు.
మహిళా అభ్యర్థులకు మంగళ సూత్రం, గాజులు వంటివి మాత్రమే అను మతి ఇస్తారు. ఇతర ఆభరణాలను కూడా అనుమతించరు. షూస్ ధరించిన వారిని పరీక్ష కేంద్రంలోకి అనుమతిం చరు.పరీక్షా కేంద్రాలను ఒకరోజు ముందుగానే చూసుకొని సరైన సమయంలో ఎగ్జామ్ కేంద్రానికి చేరుకోవాలి