జనసేన నేత శీలం బ్రహ్మయ్య కి పితృవియోగం.
భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, మైలవరం,
జనసేన పార్టీ మైలవరం మండల శాఖ అధ్యక్షులు శీలం బ్రహ్మయ్య కి పితృవియోగం కలిగింది. శీలం బ్రహ్మయ్య తండ్రి శీలం ఆంజనేయులు (67) తెల్లవారుజామున మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు మైలవరం మండలం కొత్తచండ్రగూడెం గ్రామంలో వారి నివాసానికి విచ్చేసి శీలం ఆంజనేయులు భౌతికకాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆంజనేయులు మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించారు. శీలం బ్రహ్మయ్య ని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మైలవరం నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జి శ్రీ అక్కల రామ్మోహనరావు (గాంధీ) , కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు