మల్దకల్ శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (తిమ్మప్ప స్వామి) జాతర విజయవంతం చేయాలి – సరితమ్మ…
తిమ్మప్ప స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న….
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ…. ఆదిశిల క్షేత్రం శ్రీశ్రీశ్రీ స్వయంభు లక్ష్మీ వేంకటేశ్వర స్వామి (మల్దకల్ తిమ్మప్ప స్వామి) జాతర ఉత్సవాల సందర్బంగా శుక్రవారం అర్ధరాత్రి జరిగిన స్వామివారి కళ్యాణ మహోత్సవంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ పట్టు వస్త్రాలు సమర్పించి, కళ్యాణంలో పాల్గొన్నారు… అంతకుముందు సరితమ్మ ను ఆలయ కమిటీ నిర్వాహకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు…అనంతరం సరితమ్మ మాట్లాడుతూ మల్దకల్ జాతరకు సంబందించి భక్తులకు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రణాళిక తో బందోబస్తు ఏర్పాటు చేసి స్వామి వారి తెప్పోత్సవం, రథోత్సవం, తో పాటూ మూడు రోజుల పాటు భక్తులు అధికంగా ఉంటారని అందుకు తగ్గట్టుగా,భక్తులకు ఏలాంటి ఆ సౌకర్యాలు కలుగా కుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీస్ అధికారులు, సిబ్బంది పై ఉందని అన్నారు. భాద్యతగా విధులు నిర్వహించి జాతరను విజయవంతంగా భక్తులు ప్రశాంత వాతావరణంలో జాతరను జరుపుకునేల చూడాలనీ సరితమ్మ ఆదేశించారు….
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అమరావాయి కృష్ణారెడ్డి, అల్వాల రాజశేఖరరెడ్డి, పెదొడ్డి రామకృష్ణ,గోనుపాడు శ్రీనివాస్ గౌడ్, తాటికుంట రాం చందర్ రెడ్డి,ఆనంద్ గౌడ్,సిక్కిల మల్దకల్, రాముడు, కిష్టన్న,ఎల్కూర్ తిమ్మప్ప, నర్సింహులు,ధోని ఆంజనేయులు,అయ్యప్ప,బోరుబండి వీరన్న, జగదీష్ తదితరులు పాల్గొన్నారు..