పది మందిని కాపాడి.. ప్రాణాలొదిలిన జిల్లాకు చెందిన హవల్దార్ వెంకటసుబ్బయ్య..
మృతదేహం అనంతపురం జిల్లా నార్పల గ్రామానికి చేరిక..
అధికార లాంఛనాలతో నేడు అక్కడ అంత్యక్రియలు..
స్వగ్రామమైన కంభం మండలం రావిపాడులో విషాదం..
కన్నీరుమున్నీరవుతున్న తల్లి..
మంత్రి స్వామి ఎమ్మెల్యేల దిగ్ర్భాంతి..
నివాళి అర్పించిన మంత్రి డోలా
వెంకటసుబ్బయ్య మృతిపట్ల మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి బుధవారం తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు…
30 మంది తోటి జవాన్ల ప్రాణాలు కాపాడి ఆయన వీరమరణం పొందారని తెలిపారు..
ఆయన త్యాగం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు…
కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు..
వెంకటసుబ్బయ్య మృతికి ఒంగోలు, సంతనూతలపాడు ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దన్, బీఎన్ విజయ్‌కుమార్ నివాళులర్పించారు.