SAKSHITHA NEWS

శంకర్‌పల్లి మాజీ సర్పంచ్ ఆత్మలింగంను సన్మానించిన మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు

*మరకత శివాలయ అభివృద్ధి కొరకు ఆత్మలింగం ఎనలేని కృషి చేశారు

*ఆత్మలింగం అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని చైర్మన్ పిలుపు

శంకర్‌పల్లి :డిసెంబర్ 12:శంకర్‌పల్లి మాజీ సర్పంచ్ సాత ఆత్మలింగం ను గురువారం శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివాలయ ఆల్ ఇండియా ప్రచార కమిటీ చైర్మన్ దయాకర రాజు స్వామి ఆయనను ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా దయాకర్ రాజు మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి కొరకు ఆత్మలింగం ఎనలేని కృషి చేశారని కొనియాడారు. సమాజ శ్రేయస్సు కొరకు మాజీ సర్పంచ్ మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని దయాకర్ రాజు స్వామి శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివుడిని కోరుకున్నారు. ఆత్మలింగం అడుగుజాడల్లో ప్రతి ఒక్కరు ముందుకు నడవాలని చైర్మన్ పిలుపునిచ్చారు. పలువురు దాతలు కూడా ముందుకు వచ్చి ఆలయాల అభివృద్ధికి సహాయ సహకారాలు అందించాలని మాజీ సర్పంచ్ కోరారు. అనంతరం స్వామి వారి చిత్రపటాన్ని బహుకరించి, తీర్థ ప్రసాదాలను చైర్మన్.. మాజీ సర్పంచ్ కు అందజేశారు.


SAKSHITHA NEWS