SAKSHITHA NEWS

గ్రూప్ -II పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS అమలు: జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాధ్ కేకన్ IPS

గ్రూప్ – II రాత పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు

పరీక్ష కేంద్రాల వద్ద 163 BNSS-2023 సెక్షన్ అమలు

పూర్తి పారదర్శకంగా పరీక్షలు నిర్వహణ

21 పరీక్ష కేంద్రాలకు మొత్తం 7680 మంది హాజరు కనున్నారు

మహబూబాబాద్ జిల్లా పరిధిలో డిసెంబర్ 15,16 తేదీలలో జరిగే TGPSC గ్రూప్-II పరీక్షల నేపథ్యంలో అయా పరీక్ష కేంద్రాల వద్ద సెక్షన్ 163 BNSS యాక్ట్ -2023 (భారతీయ నాగరిక్ సురక్షా సంహిత) అమలులో వుంటుందని జిల్లా ఎస్పీ సుదీర్ రాంనాధ్ కేకన్ ప్రకటనలో తెలిపారు.

డిసెంబర్ 15 నుండి 16 వరకు జిల్లావ్యాప్తంగా 21 పరీక్షా కేంద్రాలలో నిర్వహించే గ్రూప్- II పరీక్షల సందర్భంగా డిసెంబర్ 15 ఉదయం 6:00 గంటల నుంచి డిసెంబర్ 16 సాయంత్రం 6:00 వరకు అంక్షలు అమలులో ఉంటాయని,

  • పరీక్ష కేంద్రాలకు 200 మీటర్ల దూరం వరకు ఐదుగురికి మించి గుంపులుగా వుండరాదని, ఏలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలకు, మైకులు, డిజేలతో ఉరేగింపులు, దర్నలు, ప్రచారాలు నిర్వహించరాదని పెర్కొన్నారు.
  • పరీక్ష సమయంలో పరిసరాలలోని ఇంటర్నెట్ సెంటర్స్, జిరాక్స్ షాపులు, స్టేషనరీ దుకాణాలు మూసివేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని సూచించారు. అదేవిధంగా పరిక్ష సమయంలో ఎటువంటి ఆటంకాలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 163 BNSS సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ గారు తెలిపారు.
పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాలలో పోలీస్ పెట్రోలింగ్ పార్టీలను నియమించినట్లు తెలిపారు.
ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసేందుకు నిఘాను నియమించి సమాచారం సేకరించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.


SAKSHITHA NEWS