రేవతి మృతితో మాకేం సంబంధం.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంధ్య థియేటర్ ఓనర్
పుష్ప 2 ప్రీమియర్ షో తొక్కిసలాటలో రేవతి మృతికి తమకు ఎలాంటి సంబంధం లేదని సంధ్య థియేటర్ యజమాని రేణుకా దేవీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ప్రీమియర్ షో, బెనిఫిట్ షోలకు ప్రభుత్వమే అనుమతిచ్చింది. పైగా ప్రీమియర్ షో మేం నిర్వహించలేదు. ఆ షోను డిస్ట్రిబ్యూటర్లే నిర్వహించారు.
అయినా మా బాధ్యతగా బందోబస్తు కల్పించాం. అలాంటి మాపై తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడం అన్యాయం అని పేర్కొన్నారు