SAKSHITHA NEWS

Mohan Babu: గన్ల సీజ్.. పోలీసుల కీలక ఆదేశాలు..

హైదరాబాద్.. నటుడు మోహన్ బాబు కి పోలీసులు షాక్ ఇచ్చారు..

రాచకొండ పోలీస్ కమిషనర్ మోహన్ బాబు కి నోటీసులు జారీ చేశారు..

ఉదయం 10:30 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు..

సిపి స్వయంగా విచారణ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది..

అంతేకాక జలపల్లి లో జరిగిన దాడి ఘటన పై రాచకొండ సిపి సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది..

ఇప్పటికే మంచు మోహన్ బాబు మంచు మనోజ్ అలాగే మంచు విష్ణుకు చెందిన లైసెన్స్ గనులను పోలీసులు సీజ్ చేశారు..

అంతకుముందు జూబ్లీహిల్స్ నుంచి గన్ లైసెన్సులు పొందారు మోహన్ బాబు విష్ణు…

వీరిద్దరి గన్ లైసెన్సులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవాలని పోలీసులకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు..


SAKSHITHA NEWS