SAKSHITHA NEWS

మోహన్ బాబు ఇంటి వద్ద కొట్టుకున్న బౌన్సర్లు

హైదరాబాద్:
మంచువారింట్లో గొడవలు మంటలు రేపుతున్నాయి. మోహన్‌బాబు కుమారులు మంచు విష్ణు-మంచు మనోజ్ మధ్య గొడవలు ముదిరాయి. మోహన్ బాబు ఇంటి చుట్టూ విష్ణు 40 మంది బౌన్సర్లను పెడితే..

మనోజ్‌ 30 మంది బౌన్సర్ల ను దింపాడు. దుబాయ్‌ నుంచి కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్న విష్ణు కాసేపట్లో మోహన్‌ బాబు ఇంటికి వెళ్లను న్నారు.

అయితే హైదరాబాదులోనే జల్ పల్లి లోని మోహన్ బాబు ఇంటి వద్ద ఈరోజు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది, మంచు మనోజ్‌ బౌన్సర్లు, మంచు విష్ణు బౌన్సర్లు, మధ్య గొడవ జరిగింది,

ఇంట్లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన మంచు మనోజ్ బౌన్సర్లను విష్ణు బౌన్సర్లు అడ్డుకొని తోసే శారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది అక్కడికి పహాడీ షరీఫ్ పోలీసులు చేరుకొని విచారిస్తున్నట్లు తెలిసింది.


SAKSHITHA NEWS