టీచర్ ఎమ్మెల్సీ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు..
ఉభయ గోదావరి జిల్లా టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు (డిసెంబర్ 9) కాకినాడ జేఎన్టీయూలో కొనసాగనుంది. ఈ నెల 5న ఈ నియోజకవర్గం పరిధిలోని కాకినాడ, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని 11 మండలాల్లో పోలింగ్ జరిగింది..
ఈ ఓటింగ్ ప్రక్రియలో 15, 495 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 14 రౌండ్స్ లో 9 టేబుల్స్ పై ఓట్ల లెక్కింపు కొనసాగనుంది.