SAKSHITHA NEWS

శ్రీ స్వామి అయ్యప్ప 45వ మండల విళక్కు దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎన్ఎండి ఫయాజ్ , రామచంద్ర రావు

నంద్యాల స్థానిక శ్రీ స్వామి అయ్యప్ప సేవా సమాజము వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 45వ మండల విళక్కు దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ , టిడిపి రాష్ట్ర కార్యదర్శి రామచంద్రరావు పాల్గొని ప్రత్యేక పూజలు ( ఆయుధ పూజ , మూలవిరాట్ కు పుష్పాభిషేకం ) నిర్వహించారు . ఈ సందర్భంగా సింగారి మేళం కేరళ బృందం చే గురు స్వాముల ఆధ్వర్యంలో కళశ యాత్రను ప్రారంభించడం జరిగింది . ఈ కార్యక్రమంలో గురు స్వామి పి లక్ష్మయ్య , పసుపులేటి జనార్ధన్ , బోయ రామకృష్ణ , శేగు నాగరాజు , కామిని మల్లికార్జున , మిద్దె హుస్సేన్ , అర్చకులు గోపీనాథ్ స్వామి , గోవిందు నాయుడు , శ్రీరామ్ మూర్తి , నాగరత్నమ్మ తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS