SAKSHITHA NEWS

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం – ప్రజా పాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగం గా కొల్లాపూర్ మినీ స్టేడియం లో సీఎం కప్ ఆటల పోటీలను ప్రాంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు.

తెలంగాణ రాష్ట్రo లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయి ఒక సంవత్సరo పూర్తి చేసుకున్న సందర్బంగా గత వారం రోజులు గా ప్రజా పాలన విజయోత్సవాలు నిర్వహించడం జరిగింది.

అందులో భాగం గా కొల్లాపూర్ అర్బన్ లో గల స్కూల్స్ కి సీఎం కప్ పేరిట ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది.

ఈ యొక్క ఆటల పోటీలను నేడు మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు కౌన్సిలర్ షేక్ రహీం పాష లు ముఖ్య అతిదులు గా పాల్గొని ఆటల పోటీలు ప్రారంభించారు.

ఆట పోటీలలో పాల్గొన్న విద్యార్థుల కు శుభాకాంక్షలు తెలియజేసారు.ఈ కార్యక్రమం లో మున్సిపల్ చైర్ పర్సన్ మేకల రమ్య నాగరాజు,కౌన్సిలర్ షేక్. రహీం పాష,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసన్,యంపి డిఓ కె.మనోహర్ మరియు స్థానిక మండల విద్యాశాఖ అదికారి ఇమ్యానుల్ వివిధ పాఠశాల లకు సంబందించిన వ్యాయమ ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS