SAKSHITHA NEWS

రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు.. పాఠశాలల నుండే ప్రారంభం:గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

గుడివాడలో మెగా పేరెంట్స్,టీచర్స్ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యే..

పూర్వ విద్యార్థులైన సోదరీమణులతో కలిసి.. ఏ.కె.టి.పి బాలికల ఉన్నత పాఠశాలలో సందడి చేసిన ఎమ్మెల్యే రాము

గుడివాడ : రాష్ట్ర భవిష్యత్తుకు పునాదులు పాఠశాలల నుండే ప్రారంభం అవుతాయని.. అలాంటీ చదువు ప్రాముఖ్యతను గుర్తించి రాష్ట్రంలో విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవతో చర్యలు తీసుకుంటుందని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు.

గుడివాడ పట్టణం కాకర్ల వీధిలోని ఏ.కె.టి.పి మున్సిపల్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఉదయం పాల్గొన్నారు.

సమావేశంలో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యే రాముకు హర్షద్వానాల మధ్య విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాముకు కరచాలణం ఇచ్చేందుకు విద్యార్ధినిలు పోటీపడ్డారు. తల్లితండ్రులకు నమస్కరిస్తూ, విద్యార్థులకు అభివాదాలు చేసిన ఎమ్మెల్యే రాము.. పాఠశాల పూర్వ విద్యార్థులైన తన సోదరీమణులు చెకూరు రజనీ, పెద్దు ఝాన్సీలను సభకు పరిచయం చేసి సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.

ముందుగా తల్లిదండ్రుల చేత.. ప్రతిజ్ఞ చేయించిన అధ్యాపకులు, పాఠశాల ప్రగతి నివేదికను చదివి వినిపించారు. సమావేశంలో విద్యార్థినీలు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

కార్యక్రమంలో భాగంగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మాట్లాడుతూ చదువు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన అవసరమని.. అలాంటి విద్యను పూర్తిస్థాయి వసతులతో ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా అందించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఆ దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుందని ఆయన తెలియజేశారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా, మనందరం కూడా మారాలని, ఆడపిల్లలను తక్కువ చేసి చూసే రోజులు ఎప్పుడో పోయాయన్నారు. ఆడపిల్లలు జీవితంలో ఎలాంటి పరిస్థితులైనానైనా ఎదుర్కొని, చక్కటి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయికి చెరుకునెలా అధ్యాపకులు,తల్లిదండ్రులు తీర్చిదిద్దుతూ.. వారిని ప్రోత్సహించాలని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా వికసిత్ ఆంధ్ర 2047లో భాగంగా జిల్లా స్థాయిలో ఇటీవల నిర్వహించిన వివిధ పోటీల్లో బహుమతులు సాధించిన విద్యార్థులను ఎమ్మెల్యే రాము అభినందించారు.పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే రాము సమకూర్చిన నోటు పుస్తకాలను పంపిణీ చేశారు.

మెగా పేరెంట్స్ ఉపాద్యాయుల సమావేశంలో ఎంఈఓ బాలాజీ, హెచ్ఎం ఉమామహేశ్వరరావు, గుడివాడ జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, మున్సిపల్ మాజీ చైర్మన్ గుదే లక్ష్మి రంగనాయకమ్మ, టిడిపి నాయకులు చేకూరు జగన్మోహన్రావు, అల్లాడ శ్రీనివాస్, మరీదు కరుణ,మాజీ కౌన్సిలర్ మాదాసు వెంకటలక్ష్మి, డిస్టిక్ ఆర్బిఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ బి శ్వేత, బాపూజీ నగర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యులు జి.జె.డి ప్రిన్స్, ఏకేటిపి పాఠశాల అధ్యాపకులు మరియు విద్యార్థినీల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS