మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని ప్రతిష్టాత్మకంగా చేయాలి ఎంఈఓ శ్రీమతి.కే లక్ష్మి
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల కెవిఆర్ నగర్ చిలకలూరిపేట మండల విద్యాశాఖ అధికారి శ్రీమతికి లక్ష్మీ సందర్శించి ఉపాధ్యాయుల హాజరు హాజరు విద్యార్థుల హాజరు వివిధ రిజిస్టర్లు రికార్డులు తనిఖీ చేయడం జరిగింది అనంతరం మాట్లాడుతూ డిసెంబర్ 7వ తేదీన జరిగే మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశాన్ని జయప్రదం చేయాలని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని తెలిపారు.విద్యార్థులను సంసిద్ధులు చేయాలని, విద్యార్థుల తల్లిదండ్రులకు వ్యక్తిగతంగా ఆహ్వానాలు పంపాలని తెలిపారు. పండుగ వాతావరణం లో మెగా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరపాలని తెలిపారు.ఈ సమావేశంలో పాఠశాల వివరాలు పాఠశాలలో ప్రభుత్వం కల్పిస్తున్న వస్తువుల వివరాలు విద్యార్థుల కనిపిస్తున్న పోషకాహారం గురించి విద్యార్థుల వ్యక్తిగత పరిశుభ్రత.
విద్యార్థుల ఆరోగ్య కోసం ఐరన్ టాబ్లెట్స్ కంపెనీ రక్తపరీక్ష నిర్వహణ గురించి విద్యార్థుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలి.విద్యార్థుల ప్రగతి రోజువారి హాజరుSA 1,SA2.పరీక్షల్లో పొందిన మార్పులు అన్ని వివరాలను హోలీ స్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ ద్వారా తెలియజేయాలని తెలిపారు. అనంతరం భారతరత్న ఇందిరా గాంధీ మున్సిపల్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు జివి రమణ రావు తో కలిసి మధ్యాహ్న భోజనం పరిశీలించి తగు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహార భోజనం అందించాలని తెలిపారు విద్యార్థులందరూ భోజనానికి ముందు చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, విద్యార్థులందరూ వ్యక్తిగత మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలియజేశారు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు ఉపాధ్యాయురాలు శ్రీమతి యన్ అంజమ్మ పాల్గొన్నారు.