రాజ్యసభ రేసులో.. గల్లా జయదేవ్
- అధిష్ఠానం పరిశీలనలో మాజీ ఎంపీ పేరు
గుంటూరు జిల్లా : రాజ్యసభలో అడుగు పెట్టాలని మాజీ ఎంపీ గల్లా జయదేవ్ ఉత్సాహ పడుతున్నారు. ఖాళీ స్థానాలకు త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆశిస్తూ సీటు ప్రయత్నాలు చేస్తున్నారు. గుంటూరు లోక్సభ స్థానం నుంచి రెండు పర్యాయాలు విజయం సాధించిన జయదేవ్ మూడో పర్యాయం బరిలో నుంచి తప్పుకున్నారు. లోక్సభ సభ్యుడిగా ఉండి తనకున్న వ్యాపారాల మూలంగా ప్రజలకు అందుబాటులోఉండలేకపోతున్నా ననే భావనతో పాటు అప్పటి సీఎం జగన్ వేధింపుల నేపథ్యంలో రాజకీయాలంటేనే విరక్తి చెందారు. ఈ క్రమంలో గత ఎన్నికల్లో డాక్టర్ పెమ్మసానికి పోటీ చేసే అవకాశం లభించగా ఆయన
- గత ఎన్నికల్లో పోటీకి దూరమైనా పార్టీపై విధేయత
గెలుపును కాంక్షిస్తూ కుటుంబ సమేతంగా గల్లా వచ్చి ఓటు కూడా వేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు మంత్రి నారా లోకేశ్తో కూడా గతంలో లాగే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజ్యసభలో అడుగుపెట్టాలనే ఆకాంక్షను ఆయన ఇప్పటికే చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్ళారు. వివాద రహితుడు, నిజాయితీ పరుడైన జయదేవ్ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పరిశీలిస్తున్నట్లు సమాచారం.