SAKSHITHA NEWS

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు

హైదరాబాద్:
మాజీ మంత్రి హరీష్ రావుపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. సిద్దిపేటకు చెందిన చక్రధర్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని పంజాగుట్ట పోలీసులకు చక్రధర్ ఫిర్యాదు చేశారు. దీంతో హరీష్ రావుతో పాటు టాస్క్ ఫోర్స్ లో పనిచేసిన రాధాకిషన్ రావుపై కేసు నమోదైంది. 120 (బీ), 386,409,506 , రెడ్ విత్ 34, ఐటీ యాక్ట్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

తన ఫోన్ ను ట్యాపింగ్ చేశారని జూబ్లీహిల్స్ ఏసీపీకి సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు.


SAKSHITHA NEWS