ఢిల్లీలో కేంద్ర హోం వ్యవహారాల మంత్రి అమిత్ షా ని మర్యాద పూర్వకంగా కలిసి, ఇటీవల మహారాష్ట్ర లో జరిగిన ఎన్నికలలో విజయం సాధించినందుకు అభినందనలు తెలియ జేసిన మచిలీపట్నం పార్లమెంట్ సభ్యులు వల్లభనేని బాలశౌరి .
ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ మహారాష్ట్ర లో జనసేన అధ్యక్షులు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రచారం నిర్వహించిన అన్ని ప్రాంతాలలో తమ అభ్యర్థులు విజయం సాధించారని, పవన్ కళ్యాణ్ కు అక్కడి ప్రజలలో గల ఆదరణ వల్ల మా గెలుపు లో అయన కూడా భాగ మాయ్యారని , పవన్ కళ్యాణ్ మంచి క్రౌడ్ పుల్లర్ అని అయన తెలిపారు.
ఇందుకు ఎంపీ బాలశౌరి కేంద్ర మంత్రికి కృతజ్ఞతలు తెలియ చేస్తూ, త్వరలో ఢిల్లీలో జరగబోయే ఎన్నికలలో కూడా విజయం సాధించాలని ఆకాంక్షించారు
ఎంపీ కార్యాలయం
మచిలీపట్నం