SAKSHITHA NEWS

మహిళా పోలీస్ అధికారుల ఆత్మీయ సమ్మేళనం

శంకర్పల్లి : జన్వాడలోని కె.ఎల్.ఎన్ ఉస్తావ్ నందు 2002 బ్యాచ్ కి చెందిన మహిళా పోలీస్ ఉద్యోగులు 22 సంవత్సరాలు సర్వీస్ పూర్తి చేసుకున్న సందర్భంగా ,2002 బ్యాచ్ స్నేహితురాలు అందరూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిత్యం పోలీస్ ఉద్యోగంలో బిజీగా ఉండే తాము ఆదివారం ఒకే చోట అందరం కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు మరియు 22 సంవత్సరాల క్రితం అనంతపూర్ ట్రైనింగ్లో పరిచయాలు అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తుచేసుకొని దినమంతా ఆనందంగా గడిపారు. అలాగే అప్పట్లో పోలీస్ డ్యూటీలోకి అమ్మాయిలు రావాలంటే భయపడేవాళ్లు ప్రస్తుతం చాలామంది అమ్మాయిలు పోలీస్ ఉద్యోగంలో చేరటానికి ఆసక్తి చూపుతున్నారు అని గుర్తు చేశారు .అంతేకాకుండా తాము చిన్న వయసులో పోలీస్ ప్రభుత్వ ఉద్యోగం రావడం ప్రజాసేవలో భాగస్వాములు అవ్వడం చాలా గర్వంగా ఉందన్నారు .అటు పోలీసు ఉద్యోగంలో ఇటు ఫ్యామిలీలో తమ పాత్ర పోషిస్తూ 22 సంవత్సరాలు పూర్తి చేసుకుని 23వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న తోటి స్నేహితులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.


SAKSHITHA NEWS