SAKSHITHA NEWS

బైబిల్ శిక్షణలో డిప్లమా గ్రాడ్యుయేషన్ పొందిన–పూజర్ల బ్లేస్సి

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : సూర్యాపేట పట్టణం రాజీవ్ నగర్ లో గల గ్రేస్ టెంపుల్ దైవ సేవకులు రెవరెండ్ : డాక్టర్ : పూజర్ల సామెల్ కిరణ్ చిన్న కుమార్తె పూజర్ల బ్లేస్సి బైబిల్ శిక్షణ తరగతుల్లో డిప్లమా సర్టిఫికెట్ పొందుకున్నారు.
రెమా బైబిల్ కాలేజ్ నాగపూర్ ఇండియా,క్యాంపస్ నందు ఫౌండర్ /ప్రెసిడెంట్ రెవ. యన్.వై. థోరట్ డా. సంజయ్ కాతి థోరట్, రెవ. కెన్నెత్ డబ్ల్యూ హెగేన్ – రేమా ప్రెసిడెంట్ యు. యస్. ఏ.ల ద్వారా నిర్వహించిన కోర్సు పూర్తి చేసుకొని బ్లేస్సి ఈ సర్టిఫికెట్ను మినిస్ట్రీ పెద్దల చేతుల మీదుగా అందుకున్నారు.
క్రైస్తవ ఆధ్యాత్మిక పరిశుద్ధ బైబిలు గ్రంథం లో డిప్లొమా గ్రాడ్యుయేషన్, పరిశుద్ధాత్మ యొక్క మార్గదర్శకత్వం డిప్లమా థియ్యోలజి గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ అదేవిధంగా అభిషేకం పొందినారు.

ఈ సందర్భంగా బ్లెస్సి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్ పొందటం ఎంతో సంతోషం గా ఉందని.తమ తాత,తండ్రి ప్రభువు సేవలో ఉన్నప్పటికీ శిక్షణ ఎంతో అవసరమని తమ తాత ఆశీర్వాదములతో నాన్న ప్రోత్సాహంతో సంఘవిశ్వాసుల ప్రార్ధన బలంతో ప్రభువు కృపను బట్టి ఈ ట్రైనింగ్ పూర్తి చేసుకోవడం జరిగిందని అందుకు ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నానని తెలిపారు.ఈ సందర్భంగా బ్లెస్సి తండ్రి సామెల్ కిరణ్ మాట్లాడుతూ చిన్న వయసులో తమ కూతురు బైబిల్ శిక్షణలో డిప్లమా సర్టిఫికెట్ పొందడం ఆనందంగా ఉందని ప్రభువులో ఇంకా బలంగా ఎదగాలని తాము కోరుకుంటున్నామని తెలిపారు.తమ కూతురు ఎదుగుదల కోసం సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు


SAKSHITHA NEWS