SAKSHITHA NEWS

ఢిల్లీ హైకోర్టులో కాంగ్రెస్ నేత చిదంబరంకు భారీ ఊరట

ఎయిర్సెల్-మాక్సిస్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న చిదంబరం

ఆయనపై విచారణకు గతంలో, ట్రయల్ కోర్టు అనుమతి

తాజాగా, ట్రయల్ కోర్టు ఉత్తర్వులను నిలిపివేసిన ఢిల్లీ హైకోర్టు

కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయన ఎయిర్సెల్-మాక్సిస్ మనీలాండరింగ్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో ఆయనపై విచారణకు అనుమతిస్తూ ట్రయల్ కోర్టు గతంలో ఉత్తర్వులను ఇచ్చింది.

ఈ ఉత్తర్వులను చిదంబరం హైకోర్టులో సవాల్ చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం ఆయనపై విచారణకు ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను నిలిపివేసింది. ఈ మేరకు సింగిల్ జడ్జి ధర్మాసనం ఈడీకి నోటీసులు జారీ చేసింది.

ఎయిర్సెల్ – మాక్సిస్ కేసులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తి చిదంబరంపై ట్రయల్ కోర్టులో ఈడీ ఛార్జిషీట్‌లు దాఖలు చేసింది. అయితే, ఆ ఉత్తర్వులను నిలిపివేయాలని చిదంబరం హైకోర్టును ఆశ్రయించారు. దీంతో తాజాగా హైకోర్టు ఈ విచారణను నిలిపివేసింది.


SAKSHITHA NEWS