ఏపీ కేబినెట్ భేటీ.. కీలక నిర్ణయాలకు ఛాన్స్..
అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయనున్నట్లు తెలుస్తోంది..
సాయంత్రం 4.00 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో ఈ భేటీ జరగనుంది. రూ.85 వేల కోట్ల పెట్టుబడులపై ఎస్ఐపీబీ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపనుంది. రాజధాని అమరావతికి సంబంధించి గతంలో కాంట్రాక్టర్లకు కేటాయించిన పనుల టెండర్ల రద్దుకు ఈ క్యాబినెట్లో ఆమోదం తెలుపనున్నారు.
ఆయా పనులకు సంబంధించి కొత్త టెండర్లు పిలిచే విషయంపై నేడు జరగబోయే కేబినెట్లో చర్చించి.. అనంతరం వాటికి ఆమోదం తెలపనున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఏపీఎస్ఆర్టీసీలో మహిళల ఉచిత ప్రయాణంపై ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు సిద్దం చేసినట్లు సమాచారం..