SAKSHITHA NEWS

ప్రేమించకపోతే ఎయిడ్స్ ఇంజెక్షన్ ఇస్తా.. మీ అమ్మ, నాన్నను చంపేస్తానని యువతిని బెదిరించిన యువకుడు

హైదరాబాద్ – హయత్ నగర్లో యువతిపై లైంగిక వేధింపులు

చెరుకుపల్లి విజయ్ అనే వ్యక్తి తనకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఫ్రెండుగా ఉంటు తరువాత తనను ప్రేమ పేరుతో వేదిస్తున్నాడని తెలిపిన బీఎస్సీ నర్సింగ్ విద్యార్థిని.

ఇద్దరు సరదాగా కలిసి ఉన్న సమయంలో దిగిన ఫోటోస్, విడియోలు అందరికి చూపిస్తా అంటూ మరియు యువతి కాలేజీ నుండి వస్తున్న సమయంలో వెంటపడి.. బలవంతంగా తన బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి హత్యాచారం చేసాడని ఆరోపిస్తున్న విద్యార్థిని.

చాలా సార్లు కాలేజీలో వెంటబడి కొట్టాడని, బంధువుల అందరికి ఫోన్ చేస్తు మీ బిడ్డని చంపుతా అని బెదిరిస్తున్నాడు అని తననుండి తన కుటుంబానికి ప్రాణహని ఉందని పేర్కొన్న యువతి.

యువతి ఇంటికే వచ్చి అడ్డుపడ్డ తన తండ్రి మీద దాడికి దిగాడని అంతేకాకుండా తనకు తెలిసిన కొంత మంది అమ్మాయిలలో ఇలానె బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తెలిపిన యువతి.

గతంలో కూడా నాగార్జునసాగర్లో కంప్లైంట్ ఇవ్వగా అక్కడ కూడా కేసు అయ్యిందని తెలిపిన పోలీసులు.


SAKSHITHA NEWS