SAKSHITHA NEWS

రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్ లు తమ అనుచరులతో కలిసి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో భవన్ లో బీఆర్ఎస్ లో చేరిక. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.

కేటీఆర్ కామెంట్స్

రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరంతా గమనిస్తూనే ఉన్నారు.

తెలంగాణ ఏర్పడిన మొదట్లో హైదరాబాద్ కు పెట్టుబడులు రావని, హిందూ-ముస్లింలు గొడవలు జరుగుతాయని ప్రచారం చేశారు.

కానీ కేసీఆర్ గారు అభివృద్ధే కులం, సంక్షేమమే మతం అన్నట్లుగా అభివృద్ధి చేసి అవన్నీ ప్రచారాలే అనే విధంగా చేశారు.

దేశంలో తెలంగాణను ఎన్నో రంగాల్లో రోల్ మోడల్ గా నిలిపారు.

వ్యవసాయం, విద్యుత్, పేదవాళ్లను ఆదుకోవటం, సంక్షేమం, ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్ చేశారు.

కరోనా లాంటి సమయంలోకు సంక్షేమం ఆపకుండా పేదలను కడుపులో పెట్టుకొని చూశారు.

ఆయన చేసిన అభివృద్ధి కారణంగానే రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్ ను ప్రజలు గెలిపించారు.

పైరవీల కోసం అక్కడి ఎమ్మెల్యే పార్టీ మారినప్పటికీ మేము ఉన్నామని కార్యకర్తలు బలంగా నిలవటం చూస్తుంటే గర్వంగా ఉంది.

కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనకు కూడా వచ్చాయి. కానీ వాటిని మనం గట్టిగా ఎదుర్కోవాలి.

2000 సంవత్సరంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు. 24 ఏళ్లలో ఇంతింతై వటుండింతే అన్నట్లుగా రాష్ట్రం నలుమూలలా బీఆర్ఎస్ బలంగా మారింది.

కేసీఆర్ అంటే ఒక శక్తి. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు.

గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ ఫినిష్ చేస్తా అన్నారు. కానీ చరిత్ర తొంగి చూసుకో రేవంత్ రెడ్డి.

కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో…వాళ్లతోనే కాలేదు. నువ్వు ఎంత?

కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే… రేవంత్ రెడ్డికి సీటు సీటు ఉంటుండేనా?

పదవులు ఉండటం కాదు. ప్రజల గుండెల్లో కేసీఆర్ గారికి ప్రత్యేక స్థానం ఉంది.

రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు.

కేసీఆర్ రైతుబంధు రూ. 10 వేలు బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు…మేము రూ. 15 వేలు ఇస్తాం అని నువ్వే కదా అన్నావ్.

వానాకాలం రైతు బంధు ఇప్పటికీ పడలేదు. దాన్ని ఎగ్గొట్టారు. రైతన్నలు ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు.

కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు చేస్తా అంటివి.

సోనియమ్మ బర్త్ డే నాడే చేస్తా అంటివి. ఒక ఏడాది అయిపోయింది. మళ్లీ సోనియమ్మా బర్త్ డే వస్తోంది.

ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వలేదు.

సోనియా గాంధీని మాత్రమే కాదు. మొత్తం ప్రజలందరినీ మోసం చేశాడు.

దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఒట్లు వేశాడు.

దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి.

పంద్రాగస్ట్ లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది?

ఒక్క హిందూ దేవుళ్లను మాత్రమే కాదు అన్ని మతాల దేవుళ్లను మోసం చేశాడు.

జిల్లాల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి కొంతమంది మోసపోయారు. కానీ హైదరాబాద్ లో కాంగ్రెస్ నైజం తెలుసు కాబట్టి వాళ్లకు ఓటు వేయలేదు.

హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు.

మనం గెలిపించిన వాళ్లు మనల్ని వదలిపోయారు. కానీ ఆయన పశ్చాత్తాపం చెందటం ఖాయం.

రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన సరే కార్యకర్తలే పార్టీ నడుపుతుండటం సంతోషనిస్తోంది.

ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజల కోసం పోరాడి వాళ్ల గుండెల్లో శాశ్వత స్థానం సంపాందిచుకోవచ్చు.

మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నస్తున్నాడని మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించాం.
రాజేంద్రనగర్ నియోజకవర్గం మొత్తం మేము తిరిగితే…ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

మా కష్టంలో ఎవరు మాతో ఉన్నారో మాకు అర్థమైందని అన్నారు.

40, 50 ఏళ్ల నుంచి ఉన్న మీ భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్స్ లు కట్టించుకొని కబ్జాదారులు అంటారా?

కోట్ల విలువ చేసిన ఇళ్లను కూలగొట్టి…ప్రజలను దిక్కులేని వాళ్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు.

కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనే తాను కట్టించినట్లు ఇస్తామని చెబుతున్నాడు.

బీజేపీ నాయకులు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు స్పందించి ఇవ్వాళ మూసీ పక్కన పండుకుంటారంట. చాలా సంతోషం.

మూసీ లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు కచ్చితంగా వివరంగా చెప్పాల్సి అవసరం మాపైన ఉంది.

మూసీకి పునరుజ్జీవం అని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు.

గత 60 ఏళ్ల నుంచే మూసీలోకి మురిక…


SAKSHITHA NEWS