SAKSHITHA NEWS

రూ. 3 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నిర్మిస్తున్న ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ లో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా చేపట్టబోయే ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను మరియు రూ.1 కోటి రూపాయల అంచనావ్యయం తో చేపట్టబోయే చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో జరుగుతున్న చిల్డ్రన్ పార్క్ సుందరికారణ పనులలో భాగంగా నిర్మిస్తున్న ప్రహరిగోడ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. అనంతరం ఫంక్షన్ హల్ నిర్మాణ పనులు కూడా మొదలుపెడతారని అన్నారు. పీజేఆర్ నగర్ కాలనీ వాసుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని, అందరికి ఆమోదయోగ్యమైన ఫంక్షన్ హాల్ ను అన్ని హంగుల తో సకల సౌకర్యాల తో నిర్మిస్తామని కార్పొరేటర్ తెలియచేసారు. ఫంక్షన్ హల్ పేద మధ్య తరగతి ప్రజలకు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియచేసారు. ఫంక్షన్ హల్ లో వివాహాది శుభకార్యాలు, సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతుంది అని అన్నారు. ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, CH.భాస్కర్, మల్లేష్, యాదగిరి, అగ్రవాసు, ఫారూఖ్, ఖలీమ్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, బాబు నాయక్, నాగరాజు, సాయి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS