2వేలకు పైగా.. గ్రూప్ -4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్..!!
ఈ ఉద్యోగాలు పొందిన వారిలో ఇతర ఉద్యోగులు
టీచర్‌గా ఎంపికైన అభ్యర్థికి గ్రూప్-4 ఉద్యోగం
నాట్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడంతో ఎఫెక్ట్
రెండు వేల పోస్టులు బ్యాక్లాగ్ అవుతాయంటున్న అభ్యర్థులు
హైదరాబాద్, గ్రూప్-4లో భారీగా పోస్టులు బ్యాక్లాగ్ అయ్యే అవకాశాలున్నా యి. 2వేలకు పైగా ఉద్యోగాలు భర్తీకాకుం డా మిగలనున్నాయి. ప్రభుత్వం తీసుకు న్న అనాలోచిత నిర్ణయంతో ఈ పోస్టులు మళ్లీ బ్యాక్లాగ్ అవుతాయని అభ్యర్థులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గ్రూప్-4 ఫలితాలను గురువారం విడుదల చేశారు. 8,180 పోస్టులకు 8,084 పోస్టుల ఫలితాలు విడుదల చేశారు. అయితే ఉద్యోగాలు పొందిన వారిలో చాలా మంది ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్నవారున్నారు. కొందరు టీచర్లుండగా, మరికొందరు కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్నారు. వీరంతా మంచి శాఖల్లో, మంచి పోస్టు వస్తే గ్రూప్-4 ఉద్యోగంలో చేరాలన్న ఆశతో గ్రూప్-4కు రాశారు. అయి తే చాలా మందికి మంచి పోస్టులు దక్కలేదు. దీంతో వారంతా ఆయా పోస్టులను వదులుకోనున్నారు. తుది ఫలితాలకు ముందు ఆన్‌విల్లింగ్(ఉద్యోగం ఇష్టంలేదని) ఆప్షన్ తీసుకుంటే ఈ పోస్టులు బ్యా క్లాగ్ అయ్యేవికావని, నిరుద్యోగులకు న ష్టం జరిగేది కాదని అభ్యర్థులంటున్నారు.
వరంగల్ జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి ఇప్పటికే టీచర్‌గా పనిచేస్తున్నాడు. తాజాగా గ్రూప్-4 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. టీచర్ ఉద్యోగమే ఉన్నతస్థాయి ఉద్యోగం కావడంతో ఇప్పుడా అభ్యర్థి గ్రూప్-4 ఉద్యోగాన్ని వదులుకోనున్నాడు. ఎంపికకు ముందే ఆన్ విల్లింగ్ ఆప్షన్ ఇస్తే మరో అభ్యర్థికి ఉద్యోగం దక్కే అవకాశముండేది.
కరీంనగర్ జిల్లాలో మరో అభ్యర్థి పం చాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాడు. గ్రూప్-4లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం దక్కగా అప్పటి ఉద్యోగం చేయాలన్న తలంపుతో ఉన్నాడు. దీంతో జూనియర్ అసిస్టెంట్ పోస్టు బ్యాక్లాగ్కానుంది.
కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న వారు సై తం గ్రూప్-4 ఉద్యోగాలు పొందారు. హోదా, దర్పం, పదోన్నతి పరంగా కానిస్టేబుల్‌గా ఉండేందుకు కొంత మంది ఇష్టపడుతున్నారు.
మళ్లీ వచ్చేదెప్పుడో..
ఇప్పుడు బ్యాక్లాగ్ అయిన పోస్టులను మళ్లీ భర్తీచేసే అవకాశాలు కనిపించడం లేదు. సమీప భవిష్యత్తులో గ్రూప్-4 నోటిఫికేష న్ వచ్చే పరిస్థితులు లేవు. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో గ్రూప్-4 ప్రస్తావనే లేదు. గ్రూప్-4ను రద్దుచేసి, ఆయా పోస్టులను గ్రూప్-3లో విలీనం చేస్తారనే ప్రచా రం ఉంది. ఇది వరకు పోస్టుల భర్తీ లో రీలింక్విష్మెంట్ అవకాశం క ల్పించారు. కానీ అకస్మాత్తుగా రీలింక్విష్మెంట్ ఆప్షన్‌ను ప్రభుత్వం తొలగించినట్టు అభ్యర్థులు వాపోతున్నారు. అటు ఆ న్ విల్లింగ్ ఆప్షన్ ఇవ్వకపోవడం, ఇ టు రీలింక్విష్మెంట్ ఆప్షన్‌ను తొలగించడంతో తమకు తీవ్ర అన్యా యం జరుగుతుందని వాపోతున్నా రు. ఆన్ విల్లింగ్ ఆప్షన్ ఇచ్చి ఇప్పటికైనా తమకు న్యాయం చేయాలని అభ్యర్థులు కోరుతున్నారు.