SAKSHITHA NEWS

కార్తీక పౌర్ణమి సందర్భంగా రోజున వెల్గటూర్ మండలంలోని కోటిలింగాల శ్రీ కోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసన సభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ *

అనంతరం ఆలయ అర్చకులు, స్వామి వారి తీర్ధ ప్రసాదాలను వారికి అందజేశారు.తదుపరి మండల నాయకులతో కలిసి కోటిలింగాల వద్ద గల బోటింగ్లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవిత్ర కార్తీక మాసంలో ఆ దేవ దేవుడైన మహా శివుని ఆశీస్సులు నియోజకవర్గ ప్రజానీకం పైన మరియు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఎల్లవేళలా ఉండాలని,ఆ దేవదేవుడి ఆశీస్సులతో విజయవంతంగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని,కానీ ప్రతిపక్షాలు స్వయంగా సమస్యలను సృష్టించి వాటిని పరిష్కరించాలని అనవసర ఆందోళనలు చేయడం జరుగుతుందని,ఇటీవల జరిగిన కలెక్టర్ పై దాడిలో కూడా ప్రతిపక్ష పార్టీల హస్తం ఉందని,కేసీఆర్ ఒక మాట, కేటీఆర్ ఒక మాట,హరీష్ రావు ఒక మాట,ఈ విధమైన పొంతన లేని విధానాన్ని అవలంబిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం బి.ఆర్.ఎస్ పార్టీ చేయడం జరుగుతుందని,కానీ ప్రజలు వారి మాటల్ని నమ్మే స్థితిలో లేరని ఈ సందర్భంగా తెలిపారు..

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS