SAKSHITHA NEWS

పకడ్బందీగా జాతీయ సాధన సర్వే మూడో నమూనా పరీక్ష
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
వెల్గటూర్: విద్యార్థుల సామర్ధ్యాలు తెలుసుకునేందుకు ప్రతి
ఏడాది ప్రభుత్వం జాతీయ సాధన సర్వే(న్యాస్) పరీక్ష నిర్వహిస్తుంది. గతేడాది వరకు నేరుగా పరీక్ష నిర్వహించేవారు. 2024-25 సంవత్స రంలో మార్పులు చేశారు. మూడు సార్లు న్యాస్ నమూనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణ యించారు. ఇప్పటికే రెండు నమూనా పరీక్షలు పూర్తయ్యాయి. వెల్గటూర్, ఎండపల్లి మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు కేజీబీవి, మోడల్ స్కూల్ లలో 3, 6, 9 తరగతుల విద్యార్థులకు మూడో నమూనా పరీక్ష నిర్వహించారు.
నిర్దేశిత సమయం కేటాయింపు
న్యాస్ పరీక్షకు తరగతుల వారీగా సమయం కేటాయించారు.

3వ తర గతికి 45 మార్కులకు 90 నిమిషాలు, 6వ తరగతికి 51 మార్కులకు 90 నిమిషాలు, 9వ తరగతికి 60 మార్కులకు 120 నిమిషాలు కేటాయిం చారు. ఇందులో గణితం, పరిసరాల విజ్ఞానం, సైన్స్ నుంచి ప్రశ్నలు ఉంటాయి. జాతీయ సాధన సర్వే పరీక్షకు విద్యార్థులను పూర్తిగా సన్నద్ధం చేసేలా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. సెప్టెంబరు 10న మొదటి, 30న రెండో నమూనా పరీక్షలు జరిగాయి. ఇందులో భాగంగా మూడో నమూనా పరీక్షను విద్యాశాఖ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. పాఠశాలలో పరిశీలించారు. ఈ ఫలితాల ఆధారంగా వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. న్యాస్ ప్రధాన పరీక్ష డిసెంబరు 4వ తేదీన ఆయా పాఠశాలల్లో నిర్వహిస్తారు. పరీక్షలను పాఠశాలలో మండల విద్యాధికారులు బోనగిరి ప్రభాకర్, గుండేటీ రామచంద్రం, క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు వైద్య వెంకటేష్, రజని, రాజా రాణి పరిశీలించారు. డిసెంబర్లో జరిగే ప్రధాన న్యాస్ పరీక్ష పటిష్టంగా నిర్వహించేందుకు ఉపాధ్యాయులను విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నామని మండల విద్యాధికారులు బోనగిరి ప్రభాకర్, గుండేటి రామచంద్రం తెలిపారు


SAKSHITHA NEWS