సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డుతో శ్రీ చైతన్య మరో మైలురాయి.
సాక్షిత : ప్రముఖ శ్రీ చైతన్య విద్యాసంస్థలు మరో మైలురాయిని అధికమించాయి. ఈ నెల 6న ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డు ఈవెంట్ లో 20 రాష్ట్రాల నుండి పదివేల మంది శ్రీ చైతన్య విద్యార్థులు పాల్గొని 3 గంటల్లో 600 మ్యాథ్స్ ఫార్ములాలు ఏకకాలంలో పఠించి ప్రపంచ రికార్డు సృష్టించారు. ఈ ఘనత సాధించిన విద్యార్థులు 3-10 సంవత్సరాల లోపు చిన్నారులే కావడం విశేషం. ఈవెంట్ కు యూకే లోని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతిభ కనబరిచిన చిన్నారులకు అభినందనలు తెలియజేసి ప్రశంస పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ సీమ మాట్లాడుతూ శ్రీ చైతన్య స్కూల్ విద్యార్థులు సాధించిన సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ ఘనత విద్యారంగా చరిత్రలో అద్భుత ఘట్టమని చిన్నారుల ప్రతిభను కొనియాడారు.2018లో,2.5-5 సంవత్సరాల వయస్సు గల100 మంది విద్యార్థులు 100 దేశాల మ్యాప్ లను పఠించి , భౌగోళిక అవగాహనలో సాధించిన అద్భుతమైన ఫీట్ గురించి,2022లో,601 మంది విద్యార్థులు118 అంశాలను పఠించి 10 రాష్ట్రాల్లో పరమాణు చిహ్నాలతో కూడిన ఆవర్తన పట్టికను ప్రదర్శించిన విద్యార్థుల గురించి,2023 లో ,2,003 మంది విద్యార్థులు100 నిమిషాల్లో 1 నుండి 100 వరకు గుణకార పట్టికలను పఠించినా నాటి ప్రపంచ రికార్డులను ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇది కేవలం100 లో మా అధ్యాపకులు ఇచ్చిన అంకిత భావంతో కూడిన శిక్షణకు నిదర్శనమని అన్నారు. ఈ ఏడాది సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ శ్రీ చైతన్య విద్యార్థులు సాధించినందుకు మేము గర్వపడుతున్నాం.39 సంవత్సరాలుకు పైగా జాతీయ, అంతర్జాతీయ పోటీ పరీక్షలలో విజయాలను సొంతం చేసుకోవడంలో శ్రీ చైతన్య స్కూల్ స్థాయి నుండే సమగ్ర శిక్షణ పద్ధతులు, అనుభవజ్ఞులైన అధ్యాపకులు మరియు ఆధునిక వనరులు విద్యారంగంలో ఎన్నో మైలురాళ్లను అధికమించేలా చేశాయని అన్నారు. అంతేకాకుండా ఒలంపియాడ్స్ ఐఐటి జేఈఈ & నీట్ లో అత్యుత్తమ శిక్షణ ఇస్తూ జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్ మరియు నీట్ పరీక్షల్లో ఆల్ ఇండియా ర్యాంకులను సాధించి తల్లిదండ్రుల నమ్మకాన్ని చూరగోని జాతి గర్వించే విశ్వ విజేతలను అందిస్తోంది శ్రీ చైతన్య. ఈ సూపర్ హ్యాట్రిక్ వరల్డ్ రికార్డ్ మా విద్యాసంస్థల యొక్క ప్రతిభ మరియు కృషి యొక్క గుర్తింపు అని, ఈ సందర్భంగా తమ విద్యార్థులు సాధించిన విజయాలను గుర్తు చేస్తూ సహకరించిన విద్యార్థుల తల్లిదండ్రులకు, అధ్యాపకులకు, ప్రపంచస్థాయి గుర్తింపునిచ్చిన యూకే వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేశారు.